‘దేవదాసు’ చిత్రంతో పరిశ్రమకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా నెం.1 స్థానాన్ని చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అనేక షూటింగ్‌లకు అనేక దేశాలకు, మన దేశంలోని ఎన్నో ప్రదేశాలకు వెళ్లి వుండవచ్చు. ఎక్కడికెళ్లినా నటన, గ్లామర్ అన్న విషయాలే ఆలోచించే ఆమెకు తెలియని విషయం ఇప్పుడొకటి తెలిసింది. పేదరికం అనేది పెద్ద శాపం. మళ్లీ జన్మంటూ ఉంటే... పేదదానిగా మాత్రం పుట్టకూడదని దేవుడ్ని కోరుకుంటా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అందాలభామ ఇలియానా. ఇదేంటి? ఇలియానా... పేదరికం గురించి మాట్లాడటం ఏంటి? అనుకుంటున్నారా! విషయం ఏంటంటే... ఇటీవల షూటింగ్ నిమిత్తం ఓ పల్లెటూరికి వెళ్లారట ఈ ముద్దుగుమ్మ. అక్కడ తన వయసు అమ్మాయిలు ఇంట్లో టాయిలెట్స్ లేక వాటర్ బాటిళ్ళు, చెంబులు తీసుకొని బహిర్భూమికి వెళ్లడం చూసి ఇలియానా చలించిపోయారట.
అదేంటంటే పల్లెటూళ్లల్లో అందరూ బహిరంగంగానే టాయిలెట్లకు వెళ్తారని. ఈ విషయం తెలుసుకున్న ఇలియానా ఇప్పుడు చాలా బాధపడిపోతోంది. ఎంతో అభివృద్ధిచెందిన మన దేశంలో ఇంకా ఇలా వెనకబడి వుండటానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తోంది. చదువుకుని, చేతిలో సెల్‌ఫోన్ వున్నవాళ్లు సైతం ఇలా బహిరంగంగా వెళ్లడం అభ్యంతరకరమంటోంది. ‘ప్రజల కనీస అవసరాలను తీర్చడం పాలకుల ధర్మం. కానీ మన దేశంలో ఎవరి సుఖం వారు చూసుకుంటున్నారు. ఇది నిజంగా అన్యాయం. విదేశాల్లో ఈ పరిస్థితి లేదు. అక్కడ పాలకులు ప్రజాభిమానాన్ని కాపాడటంలో ముందుంటారు. ఎప్పట్నుంచో నా మదిని తొలుస్తున్న బాధ ఇది. గోవాలో ఉన్నప్పుడు నేను చిన్నపిల్లను. ఇలాంటివి నా కంట పడినా పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.
మానసికంగా పరిపక్వత చెందిన స్త్రీని నేను. అందుకే సాటి స్త్రీల పరిస్థితి చూసి హృదయం బరువెక్కుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పబ్లిక్ టాయిలెట్స్ విరివిగా కట్టించాలి. ఈ విషయంలో ప్రభుత్వంలో కదలిక వస్తే... సహాయ, సహకారాలు అందించడానికి నేనూ సిద్ధం అన్నారు ఇలియానా. గ్లామర్‌ని ఒలికించడంలోనే కాదు... మానవత్వాన్ని కురిపించడంలో కూడా తానెప్పుడూ ముందే ఉంటానని తన స్పందన ద్వారా తెలియజేసిన ఇలియానాను ఈ సందర్భంగా . దేశ నాయకులు ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు కట్టించాల్సిన అవసరం వుందని బల్లగుద్ది మరీ వాదిస్తోంది. మంచి టాపిక్‌నే తీసుకుంది కానీ ఆ చెప్పేదేదో మంచి ఫామ్‌లో వున్నప్పుడు చెప్పినట్లయితే అందరూ వినేవాళ్లు. ఇప్పుడు ఆమెకే సరైన సినిమాలు లేవు. ఇప్పుడు చెబితే ఎవరు వింటారు. అది ఇలియానా పరిస్థితి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more